వన్యప్రాణుల సంరక్షణపై విద్యార్థుల ర్యాలీ
కాగజ్‌నగర్,(విజయక్రాంతి): జాతీయ వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాల్లో(National Wildlife Conservation Week) భాగంగా కాగజ్‌నగర్‌లో విద్యార్థులు(Students) సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. త్రిశూల్ పహాడ్‌పై ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Government Degree College) నుంచి అటవీశాఖ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, అటవీశాఖ అధికారులు రవికుమార్, హేమలత మాట్లాడుతూ... వన్యప్రాణుల సంరక్షణ(Wildlife Conservation)తో పర్యావరణ సమతుల్యత కాపాడబడటంతో పాటు మానవ మనుగడకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
వన్యప్రాణుల రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డిగ్రీ, జూనియర్ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి తూడూరు దత్తాత్రేయ, ఎకోక్లబ్ ఇన్‌చార్జ్ డాక్టర్ దేవేందర్‌రెడ్డి, విద్యార్థులు, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.