విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
జుక్కల్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(MLA Thota Lakshmi Kantharao) అన్నారు. బుధవారం జుక్కల్ మండలం బస్వాపూర్ శివారులో గల కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో సరస్వతి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఎమ్మెల్యేతో పాటు కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్(DCC President Yele Mallikarjun) ఇద్దరు కలిసి సరస్వతి విగ్రహావిష్కరణ చేశారు. పూజారులు మంత్రోచ్ఛారణలతో హోమం నిర్వహించారు.
అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని అన్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో నిర్ణయించడానికి పాఠశాలలోని ఉపాధ్యాయులు కాకుండా నిర్ణయించుకుని శక్తి సామర్థ్యాలు పిల్లలు అలవర్చుకోవాలన్నారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఉపాధ్యాయులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ తిరుపతయ్య, ప్రిన్సిపల్ హేమలత, నాయకులు సాయి గౌడ్, రాములు, రమేష్, సతీష్, సర్పంచ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.