అన్నప్రసాద వితరణలో పాల్గొన్న సునీల్ రావు
19-09-2026 | 11:32pm
ముకరంపుర,(విజయక్రాంతి): విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల(Vighneshwara Navaratri celebrations)లో భాగంగా నగరంలోని భగత్ నగర్, కాశ్మీర్ గడ్డ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలను బీజేపీ(BJP) రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Deputy Mayor Yadagiri Sunil Rao) దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయా మండపాలలో స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ బొజ్జ గణపయ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.