విజయవంతంగా టీసీఏ మహిళల క్రికెట్ లీగ్
20-09-2026 | 05:05am
ముగిసిన ఫేజ్ 1 పోటీలు
హైదరాబాద్, సెప్టెంబర్ 19 : తెలంగాణలో మహిళా క్రికెటర్ల(Women cricketers)ను ప్రోత్సహించేందు కు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(Telangana Cricket Association) (టీసీఏ) ని ర్వహిస్తున్న మహిళల క్రికెట్ లీగ్(Womens Cricket League) ఫేజ్ 1 విజయవంతంగా ముగిసింది. రంగారెడ్డి జిల్లా టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్రికెట్ గ్రౌం డ్‌లో ఫైనల్స్ నిర్వహించారు. నాలుగు విభాగాల్లో జరిగిన మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. రోస్ ఫ్లెమింగోస్, రాయల్ ఫాల్క న్స్, ఫోనిక్స్ రైజర్స్, పర్పుల్ పీకాక్స్ జట్లు విజేతలుగా నిలిచాయి. హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి(Teegala Krishna Reddy) ముఖ్యఅతిథిగా హా జరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. టీసీ ఏ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి, ట్రెజరర్ హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.