5 September, 2026 | 11:34 PM

మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

05-09-2026 | 09:57pm

మల్కాజిగిరి,(విజయక్రాంతి): ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Malkajgiri Government Degree College)లో ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని(Teachers Day) పురస్కరించుకుని లయన్స్ క్లబ్ హైదరాబాద్ ఎవరెస్ట్, కలాం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అధ్యాపకులను  ఘనంగా సన్మానించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బండి రాజు అధ్యక్షతన, కళాశాల హిందీ అధ్యాపకులు డా.జగన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథులుగా హజరైన లయన్స్ క్లబ్ ప్రతినిధులు కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ బుచ్చన్న, లయన్ రఘు, లయన్ వీరస్వామి లయన్ రవీందర్ కలాం ఫౌండేషన్ సెక్రటరీ లయన్  వెంకట్ రెడ్డి కళాశాల అధ్యాప కులందరిని  పూలమాలలు, 

శాలువాలతో ఘనంగా సత్కరించి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్(Dr. Sarvepalli Radhakrishnan) చిత్రపటాలను జ్ఞాపికలుగా అందజేశారు. గౌరవ అతిథి, విశ్రాంత ప్రిన్సిపాల్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ... సమాజ నిర్మాణంలో గురువు పాత్ర అమూల్యమైనదని తెలిపారు. ఆయన తన స్వీయ కవితల ద్వారా గురువుల గొప్పతనాన్ని చాటిచెబుతూ విద్యార్థులలో నూతనోత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు లయన్ రఘు, లయన్ వీరస్వామి తమ జన్మదిన వేడుకలను కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. సమాజ సేవలో ముందుండే లయన్స్ క్లబ్, కలాం ఫౌండేషన్ సంస్థలు ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం అభినందనీయమని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బండి రాజు అన్నారు.ఈ సందర్భంగా అధ్యాపకులు, అతిథులు, విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు

మరిన్ని వార్తలు