6 September, 2026 | 12:37 AM

భక్తుల భద్రతే ధ్యేయం.. తిరుమలయ్యగుట్టపై పటిష్ట బందోబస్తు

05-09-2026 | 11:15pm

వనపర్తి: శ్రావణమాసం(Sravana Masam) చివరి శనివారం సందర్భంగా తిరుమలయ్యగుట్ట(Tirumalaiya Gutta)కు వేలాది మంది భక్తులు తరలిరావడంతో జిల్లా ఎస్పీ సునిత రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల మేరకు వనపర్తి రూరల్ ఎస్సై హృషికేష్(Wanaparthy Rural SI Hrishikesh) ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు, మెట్ల మార్గాలు, క్యూ లైన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహించారు.

ఈ సందర్భంగా మెట్లు దిగలేక ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధ భక్తురాలిని పానగల్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు గుర్తించి, ఆమెకు సహాయం చేస్తూ సురక్షితంగా కిందికి తీసుకొచ్చారు. ఆయన మానవీయతను భక్తులు అభినందించారు. పోలీసుల సమన్వయం, నిరంతర పర్యవేక్షణతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని ఎస్సై హృషికేష్ తెలిపారు.

మరిన్ని వార్తలు