ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
05-09-2026 | 01:57pm
కల్వకుర్తి, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పిఆర్టియు(PRTU) టీఎస్ కల్వకుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్(Sarvepalli Radhakrishnan)కు ఘన నివాళులర్పించారు. కల్వకుర్తి ఎమ్మార్సీ(MRC) సమీపంలోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి నాయకులు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ విద్యారంగానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో టి ఆర్ టి యు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కార్యదర్శి రియాజ్, రాష్ట్ర, జిల్లా, మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.






