16 August, 2026 | 4:20 AM

Districts - Nagarkurnool

article_23910978.webp
సమానత్వం, సామాజిక న్యాయంతోనే సమగ్ర అభివృద్ధి

నాగర్‌ కర్నూల్, ఆగస్టు 15 ( విజయక్రాంతి): 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు దోహదపడిన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం ఆధారంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ పేదలు, మహిళలు, రైతులు, యువత, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు స్వర్గీయ సినిమా శేఖరయ్య సతీమణి అంబటి లీలావతిని సత్కరించారు. విద్యార్థులు నిర్వహించిన దేశభక్తి, స్వాతంత్ర్య పోరాట ఘట్టాలపై సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు అందజేశారు. వివిధ శాఖల ఉత్తమ సేవలందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు.

15-08-2026

article_84075777.webp
అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి దిశగా అడుగులు

నాగర్‌ కర్నూల్, ఆగస్టు 15 (విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డా. బీఆర్ అంబేడ్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్ తదితరుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలతో కందనూల్ జిల్లా మొట్ట మొదటి స్థానంలో నిలిచిందన్నారు.

15-08-2026

article_59906970.webp
అమరుల త్యాగ ఫలితమే స్వేచ్ఛా స్వాతంత్య్రం

నాగర్‌ కర్నూల్, ఆగస్టు 15 (విజయక్రాంతి): దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాగర్‌ కర్నూల్ కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడుతూ అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులందరికీ చేరేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.

15-08-2026