2 డీఏల మంజూరు

02-10-2026 | 05:50am

ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్

క్యాబినెట్ నిర్ణయాలు:

  1. కరువుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం
  2. కేంద్రం సాయం కోరేందుకుఢిల్లీకి మంత్రుల బృందం
  3. ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు
  4. రాష్ట్రంలో డిమాండ్ మేరకువిద్యుత్ కొనుగోలు
  5. 7,800 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి యూనిట్లు 
  6. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల టెండర్లు రద్దు చేసి.. కొత్తగా టెండర్లు
  7. డిజిటల్ మీడియా అడ్వర్‌టైజింగ్‌కు ప్రత్యేక పాలసీ
  8. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు డిప్యూటీ కమిషనర్‌తో పాటు నలుగురు గ్రూప్ అధికారులు
  9. మంత్రివర్గం భేటీ వివరాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి
  10. 2 డీఏలతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏడాది రూ.2,500 కోట్ల భారం
  11. రాష్ట్రంలో 17% వర్షపాతం లోటు.. 235 మండలాల్లో కరువు..
  12. బుధవారం రికార్డు స్థాయిలో పీక్‌కు చేరిన విద్యుత్ వినియోగం
  13. ఖరీఫ్ సీజన్‌కు త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన గురువారం జరిగిన క్యాబినెట్  సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలతో పాటు ఎల్ నినో, ధాన్యం కొనుగోలు, విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి ప్రాజెక్టులపైన సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసు కున్నారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రభు త్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొన్నం ప్రభాకర్‌తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) మీడియాతో మాట్లాడారు. డీఏలు చెల్లించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయలు, విశ్రాంత ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని మంత్రి పొంగులేటి అన్నారు.  

రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు.. 

*రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024  నుంచి బకాయి ఉన్న డీఏలలో రెండు డీఏలను  వెంటనే మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి బకాయి పడ్డ ఎరియ ర్స్‌ను వాయిదాల్లో చెల్లిస్తారు. ఆర్థికంగా భారమైనప్పటికీ.. ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.  

*రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులపై క్యాబినెట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. రాష్ట్రంలో ఈ వానాకాలంలో దాదాపు 17 శాతం వర్షపాతం లోటు ఉంది. బుధవారంతో రుతుపవనాల కాలం కూడా ముగిసింది. దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షభావంతో కరు వు పరిస్థితులు నెలకొన్నాయి. కరువు ప్రాం తాల్లో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించాలని నిర్ణయిం చారు. త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రైతు సంఘాలతో పాటు వివిధ రంగాల నిపుణులతో భేటీలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ఉన్న ఎల్ నినో పరిస్థితులు.. చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై సలహాలు సూ చనలు స్వీకరిస్తారు.

కరువు మండలాల ప్రకటనతో పాటు రాష్ట్రానికి తగిన సాయం అం దించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. త్వరలోనే మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని నివేదిస్తాం. 

*ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని  మంత్రివర్గం నిర్ణయించింది. త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారు. ఈ సీజన్‌లో దాదాపు 65 లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల విభాగం అంచనా వే సింది. కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రివర్గం అధికారులకు సూచించింది. 

*ఎల్ నినో పరిస్థితులతో రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో సాధారణంగా ఒక్క రోజుకు 15,000 మెగావాట్ల విద్యుత్తు వినియోగం ఉండగా.. ఈ సీజన్‌లో  బుధవారం అది రికార్డు స్థాయిలో 19,892 మెగావాట్ల పీక్ డిమాండ్‌కు చేరింది. అంటే దాదాపు 20 వేల మెగావాట్లకు చేరింది. గత ఏడాది మొ త్తంలో 16,613 మెగావాట్ల గరిష్ట వినియో గం నమోదైంది. అందుకే విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తు ఉత్పత్తి, తగినం త విద్యుత్తు సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్తు కోత లేకుండా సరఫరా చేసేందుకు అవసరమైనంత విద్యుత్తును సమకూర్చుకోవాలని, డిమాండ్ మేరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

భవిష్యత్తు డిమాండ్, అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి, విద్యుత్తు సమీకరణపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. దాదాపు 7,800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా యూనిట్లు నెలకొల్పేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో 3,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు, 4,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, 800 మెగావాట్ల పవన విద్యుత్తు యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించింది. కేంద్ర నిబంధనల మేరకు బిడ్డింగ్ విధానంలో ఈ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణ యించింది. 

*రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడలో వరల్డ్  క్లాస్ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఈ మార్కెట్ ఏర్పాటు చేయాలని క్యాబినెట్ సూచించింది.

*దీర్ఘకాలంగా పెండింగ్‌లో  ఉన్న ప్రాజెక్టులను పున:సమీక్షించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈపీసీ విధానంలో చేపట్టిన ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉంటే రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా 10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

*తెలంగాణలో డిజిటల్ మీడియా అడ్వర్టై జింగ్‌కు  ప్రత్యేక పాలసీ అమలుచేసే ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ రూపొందించిన డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలో ఈ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

*న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పోస్టు మంజూరుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. మరో నలుగురు గ్రూప్ 1 అధికారులను కూడా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పనిచేసేందుకు నియమించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు