నగరపాలక సంస్థలో తెలంగాణ విమోచన దినోత్సవం
ముకరంపుర,(విజయక్రాంతి): సెప్టెంబర్ 17ను నిజాం నిరంకుశ పాలన రజాకార్ల అరాచకాల నుండి తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించిన రోజుగా సువర్ణ అక్షారాలతో లిఖించ దగినదని మేయర్ కొలగాని శ్రీనివాస్(Mayor Kolagani Srinivas) అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయం(Karimnagar Municipal Corporation office)లో గురువారం తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ వేడుకలు(Telangana State Liberation Day Celebrations) జరిగాయి. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, పలువురు కార్పొరేటర్ల, అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
జాతీయ గీతాన్ని ఆలపించి త్రివర్ణ పతాకాని కి గౌరవ వందనం చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమర వీరులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల త్యాగమే నేటి తెలంగాణ స్వేచ్చా వాతావరణం అన్నారు. నిజాం నిరంకుశ పాలన రజాకార్ల అరాచకాల పై సాయుధ పోరాటం సాగించి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించారని గుర్తు చేశారు. వీరుల త్యాగాల ఫలితంగా నే తెలంగాణ ప్రాంతానికి స్వేచ్చా ఫలించిందని నాటి నుండి సెప్టెంబర్ 17 రోజును సువర్ణ అక్షరాలతో లిఖించ బడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.