నాగిరెడ్డిపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం
17-09-2026 | 10:50pm
నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) నాగిరెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో నేడు తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day) సందర్భంగా పార్టీ ఆఫీసు వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ... నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు స్వాతంత్రం లభించిన రోజు సెప్టెంబర్ 17 అని, తెలంగాణ విముక్తి కోసం దేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని గుర్తు చేయడం జరిగింది. అనంతరం నరేంద్ర మోడీ 76 పుట్టినరోజు సందర్భంగా స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది.