మభ్యపెట్టి టెట్ పేపర్ లీక్

20-09-2026 | 05:05am
  1. ప్రింటింగ్ ప్రెస్ ఇద్దరు ఉద్యోగులకు 16వేలు
  2. మహారాష్ట్ర లీక్ కేసు.. వెలుగులోకి పోలీసుల చార్జీషీట్

ముంబై, సెప్టెంబర్ 19: మహారాష్ట్ర టెట్(Maharashtra TET) (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పేపర్ లీక్ కేసు(Paper leak case)లో ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగుల(Printing press employees)కు ఒక్కొక్కరికి నిందితులు 8వేల చొప్పున చెల్లించినట్లు పోలీసులు కోర్టులో దాఖలు చేసిన చార్జీషీట్‌లో పేర్కొన్నారు. చార్జీషీట్‌లో పేర్కొన్న విషయాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగులకు ఆగ్రాలో స్థలాలు సైతం ఇప్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆగ్రాలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రాలను ఇద్దరు ఉద్యోగులు షూలో దాచి బయటికి తరలించారని పేర్కొన్నారు.

ప్రస్తుతం వీరిద్దరు పరారీలో ఉండగా, ఈ కేసులో 16 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. జూన్ 28న మహారాష్ట్రలో టెట్ పరీక్ష పత్రాలు లీకయ్యాయి. వీటిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రింటింగ్ ప్రెస్‌లోని ఉద్యోగులే బయటికి తీసుకువెళ్లినట్లు తేలింది. భద్రతా సిబ్బంది బూట్లను చెక్ చేయకపోవడంతో దీన్ని అనుకూలంగా మలచుకున్న నిందితులు అందులో పేపర్లను దాచుకొని లీక్‌కు పాల్పడ్డారు. ఈ కేసులో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు బిజేంద్ర గుప్తా ప్రధాన నిందితుడిగా ఉండగా, ఒడిశా పేపర్ లీక్ కేసులోనూ ఇతని అస్త్రం ఉందని అని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు