ఆ దేశాలు విషం చిమ్ముతున్నయ్

20-09-2026 | 05:30am
  1. అభివృద్ధి చెందిన దేశాల్లోనే కార్బన్ ఉద్గారాలు ఆరు రెట్లు ఎక్కువ
  2. పైగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై నిందలు
  3. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ ఇంధన రంగాల్లో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది
  4. ది నేచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమెట్ డైనమిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ
  5. ఎన్‌జీటీ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన మోదీ
  6. పరిరక్షణ, అభివృద్ధి సమన్వయమే లక్ష్యం: సీజేఐ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: అభివృద్ధి చెందిన దేశాలే.. వాతావరణంపై విషం చిమ్ముతున్నాయని, అత్యధిక కార్బన్ ఉద్గారాలు విడుదల చే స్తూ.. పర్యావరణానికి ముప్పు తెస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు భారత్ కంటే ఆరు రెట్లు ఎక్కువ తలసరి కార్బ న్ ఉద్గారాలను విడుదల చేస్తున్నాయని స్పష్టం చేశారు. భారత్ తలసరి కార్బన్ ఉద్గారాలు(Carbon emissions) ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉన్నాయని, అయినప్పటికీ వాతావరణ మార్పులకు(Climate change) సంబంధించి తరచూ అభివృద్ధి చెందుతున్న దేశాలనే అన్యాయంగా నిందులు వేస్తున్నాయని తెలిపారు.

కొందరు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా.. భారత్ అణుశక్తి ఉత్పత్తిని(India Nuclear Power Generation) వేగంగా విస్తరిస్తోందని వెల్లడించారు. పునరుత్పాదక ఇంధనం లో నూ దేశం దూసుకెళ్తుందని, క్లీన్ మొబిలిటీలో భారత్ సుస్థిర అభివృద్ధి దిశగా పయనిస్తోందని చెప్పారు. అలాగే సంరక్షణ, సహజ వ్యవ సాయంపైనా ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. పర్యావరణం, వాతావరణం పరిరక్షణలో భారత్ వేగవంతమైన ప్రగతిని సాధిస్తోంద న్నారు. ఈ విషయంలో భారత్ ప్రపంచంతో కలిసి పనిచేస్తోందని తెలిపారు.

పారిస్ ఒప్పందం కింద నిర్దేశించుకున్న లక్ష్యాలను గడువుకు ముందే సాధించిన ఏకైక జీ-20 దేశం భారత్ అని స్పష్టం చేశారు. గత 12 ఏళ్లలో పవన విద్యుత్ సామర్థ్యం మూడు రెట్లు పెరిగిందని, సౌర విద్యుత్ సామర్థ్యం 2 గిగావాట్ల నుంచి 160 గిగావాట్లకు పైగా పెరిగిందన్నారు. శిలాజేతర ఇంధన సామర్థ్యం 400 శాతం పెరిగిందని తెలిపారు. మొత్తంగా వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొంటూ.. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ ఇంధన రంగాల్లో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని ప్రధాని స్పష్టం చేశారు.

పరిరక్షణ, అభివృద్ధిని పరస్పర విరుద్ధంగా చూడకుండా రెండింటినీ సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్లాలని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యు నల్ (ఎన్జీటీ) నిర్వహించిన ‘పర్యావరణం, వాతావరణ గతిశీలత భవిష్యత్తు’(ది నేచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమెట్ డైనమిక్స్) అనే అంశంపై రెండు రోజుల (19 తేదీలు) అంతర్జాతీయ సదస్సును ప్రధాని శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మోదీ ఎన్జీటీ మొబైల్ అప్లికేష న్‌ను ఆవిష్కరించారు.

ఈ సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశం అణు శక్తి ఉత్పత్తిలో వేగంగా పనిచేస్తోం దని అన్నారు. అయితే, అణు శక్తి ఉత్పత్తికి సంబంధించిన పనులను తాను ముందుకు తీసుకెళ్లినప్పుడల్లా, పర్యావరణం గురించి గట్టిగా మాట్లాడేవారే ప్రభుత్వ అణు కార్యక్రమాలను నిలిపివేయడా నికి కోర్టులో కేసులు వేస్తూ, స్వచ్ఛమైన ఇంధన పరిష్కారాలను చురుకుగా వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. ‘కార్బన్ ఉద్గారాలకు బాధ్యతను తరచుగా అభివృద్ధి చెందుతున్న దేశాలపై తప్పుగా మోపుతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ వాస్తవం ఏమిటంటే, నేటికీ ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్ తలసరి కార్బన్ ఉద్గారాల వాటా సగం కంటే తక్కువగానే ఉందని తెలిపారు. 

50 లక్షలకు పైగా ఇళ్లలో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లు

భారత్‌తో పోలిస్తే అభివృద్ధి చెందిన దేశాలలో తలసరి కార్బన్ ఉద్గారాలు ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయని, ఈ వాస్తవాన్ని భారత్ ప్రపంచ వేదికలపై బలంగా వినిపిస్తోందని మోదీ చెప్పారు. స్వచ్ఛమైన ఇంధన రంగాల్లోకి ప్రైవేట్ పెట్టుబడులను తీసుకురావడానికి ప్రభుత్వం మార్గాలు సుగమం చేస్తోందన్నారు. ‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ ద్వారా 50 లక్షలకు పైగా ఇళ్లలో రూఫ్టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశామని, క్లీన్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లోనూ భారత్ వేగంగా ముందుకు సాగుతోందన్నారు.

నీటి సంరక్షణలో 70,000కు పైగా అమృత్ సరోవర్లు, ‘క్యాచ్ ది రెయిన్’ కింద సుమారు 1.5 కోట్ల నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టినట్లు మోదీ తెలిపారు. 12.5 లక్షల హెక్టార్లలో సహజ వ్యవసాయ క్లస్టర్లు ఏర్పాటు చేశామని, వాతావరణ మార్పులను తట్టుకునే సుమారు 3,000 రకాల పంట లను అభివృద్ధి చేశామని చెప్పారు. వ్యవసాయ అటవీకరణతో కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తున్నామని, దట్ట మైన అటవీ విస్తీర్ణం 22 శాతం పెరిగిందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణలో భాగంగా సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించామన్నారు. 

పరిరక్షణ, అభివృద్ధి సమన్వయమే లక్ష్యం: సీజేఐ

ఈ కార్యక్రమంలో పాల్గొన్న  సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ.. పరిరక్షణ, అభివృద్ధిని పరస్పర విరుద్ధంగా చూడకుండా రెండింటినీ సమన్వయం చేసి ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. పర్యావరణ న్యాయానికి సుప్రీంకోర్టు ‘మర్రిచెట్టు’లా నిలిచిందని పేర్కొన్నారు. వాతా వరణ మార్పులు, కాలుష్యం, జీవవైవిధ్య నష్టం వంటి సమస్యలను ప్రాజెక్టుల వారీగా కాకుండా వాటి సంచిత పర్యావరణ ప్రభావాల ఆధా రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధికి అనుమతులు ఇచ్చేటప్పుడు నిపుణుల పర్యవేక్షణ, పునరుద్ధరణ, నష్టపరిహార అటవీకరణ, జవాబుదారీతనం వంటి షరతులు ఉండాలని చెప్పారు. పర్యావ రణ పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా వివిధ న్యాయ విధానాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మరిన్ని వార్తలు