చెడ్డీ గ్యాంగ్‌లో ఒకడు చిక్కాడు!
తిరుపతిలోని గొల్లవానిగుంట ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ (gang) సంచారం కలకలం రేపింది. కార్పొరేషన్ 7వ డివిజన్లో అర్ధరాత్రి అనుమానాస్పదంగా రెక్కీ (recce) నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని స్థానికులు గుర్తించి పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించగా.. విచారణ (inquiry)లో పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. సుమారు 15 మంది ముఠా సభ్యులు తిరుపతికి వచ్చినట్లు అతడు చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు (investigation) ముమ్మరం చేశారు. అనుమానితుడి సమాచారంతో మిగతా సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.