టీఎంసీ అభ్యర్థి యూటర్న్

20-09-2026 | 05:05am
  1. టీఎంసీ ఉప ఎన్నిక రబియుల్ భిన్న ప్రకటనలు
  2. ఉదయం నామినేషన్ ఉపసంహరణ.. మధ్యాహ్నం లేదని ప్రకటన
  3. దీదీకి షాక్ ఇవ్వబోయిన రెజీనగర్ అభ్యర్థి రబియుల్

కోల్‌కతా, సెప్టెంబర్ 19: పశ్చిమ బంగాల్‌(West Bengal)లో మమతా బెనర్జీ(Mamata Banerjee) తరఫున రెజీనగర్ నుంచి పోటీలో ఉన్న రబియుల్ ఆలం చౌదరి(Rabiul Alam Chowdhury) అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు శనివారం ఉదయం ప్రకటించారు. ఆ తరువాత దీదీతో చర్చల అనంతరం మధ్యాహ్నానికి మాట మార్చి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. రెండు నియోజకవర్గాల ఉప ఎన్నికల(By elections) సందర్భంగా దీదీకి ఉన్న ఇద్దరు అభ్యర్థులు కూడా షాక్‌ల మీద షాక్‌లిస్తున్నారు. ఈసీ ఫుట్‌బాల్ ఆటగాడి గుర్తు కేటాయించడంపై రబియుల్ ఆలం చౌదరి అలకబూనారు.

శనివారం ఉదయం ఉపసంహరణ ప్రకటన చేశారు. దీంతో అప్రమత్తమైన దీదీ ఆలంతో ఫోన్‌లో మాట్లాడడంతో మధ్యాహ్నానం కల్లా రబియుల్ యూటర్న్ తీసుకున్నారు. నియోజకవర్గంలో పలువురు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు సహకరించడం లేదని, దీనికి తోడు ఇన్ని రోజులు గడ్డిపూల గుర్తుపై ప్రచారం చేశానని తెలిపారు. ఇప్పుడు ఈసీ ఫుట్‌బాల్ ఆటగాడి గుర్తు కేటాయించడంతో ఓటమి తప్పదని, ఇంత తక్కువ సమయంలో ఓటర్లను మళ్లీ ఈ గుర్తువైపు తిప్పడం అసాధ్యమని దీదీతో మొరపెట్టుకున్నారు. దీనిపై దీదీ రబియుల్‌కు ధైర్యం చెప్పారు.

దీంతో తన ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. కాగా రబియుల్ చివరి వరకు కూడా పోటీలో ఉంటారా? ఉండరా? అన్నది అనుమానమేనని సమాచారం. కాగా ఒకరోజు ముందు సంచితా ప్రధాన్ నందిగ్రామ్ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరిం చుకున్నారు. దీంతో దీదీ అక్కడి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మిలన్‌కు మద్దతు ప్రకటించారు. ఆమె ఇలా మద్దతు ప్రకటించగానే 2007 నాటి హత్య కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా మమతా బెనర్జీ పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నందిగ్రామ్, రెజీ నగర్‌లో అక్టోబర్ 6న ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. 

మరిన్ని వార్తలు