ప్రజావాణిలో 10 దరఖాస్తులు స్వీకరణ

05-10-2026 | 04:52pm

వెంకటాపూర్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం(Prajavani program)లో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 10 దరఖాస్తులు స్వీకరించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను స్వీకరించి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజు(MPDO Raju) మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, సిబ్బందీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు