ప్రజా సమస్యలపై విజయక్రాంతి గళం
- పత్రికలో ప్రచురిస్తున్న కథనాలు బాగున్నాయి
- టీఎన్జీవో కరీంనగర్ జిల్లా నాయకులు
- విజయక్రాంతి సీఈవోకు ఘనంగా సన్మానం
ముకరంపుర, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): విజయక్రాంతి దినపత్రిక(Vijayakranthi Daily Newspaper) సీఈవో రాహుల్ దేవళ్ల(Rahul Devalla)ను కరీంనగర్ టీఎన్జీవో హాల్‌లో శనివారం టీఎన్జీవోలు సన్మానించారు. విజయక్రాంతి ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లా రిపోర్టర్ల సమావేశానికి(Karimnagar, Mancherial, Asifabad district reporters meeting) ముఖ్య అతిథిగా హాజరైన విజయక్రాంతి దినపత్రిక సీఈవో రాహుల్ దేవళ్ల(Rahul Devalla), న్యూస్ నెట్‌వర్క్ ఇన్‌చార్జి ముద్దసాని రాంచందర్(Ramchander)ను టీఎన్జీవో సంఘ నేతలు(TNGO Association leaders) మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా టీఎన్జీవో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణరావు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి విజయక్రాంతి పత్రికలో ప్రచురిస్తున్న కథనాలు బాగున్నాయని అభినందించారు. ఇదే పంథాలో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో నేతలు గూడ ప్రభాకర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు ఇరుమల్ల శారద, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్, భరద్వాజ్, నాయకులు సత్యనారాయణ, నరేష్ పటేల్, సునీత, సూర్య శైలజ, సుస్మిత, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోట రామస్వామి బైరి శ్రీనివాస్, శంకర్, అజ్గర్ అలీ, వారీస్ నవాబ్ తదితరులు పాల్గొన్నారు.