21 August, 2026 | 5:13 PM

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్

21-08-2026 04:11 PM

 మార్కెట్ చైర్మన్ భానుక శివరాజు యాదవ్

జనగామ , ఆగస్టు 21 (విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి(Sri Krishna Janmashtami) వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్,  భానుక శివరాజు యాదవ్ శుక్రవారం రోజున తెలిపారు. సెప్టెంబర్ 4వ తేదీ (శుక్రవారం) నాడు జిల్లా కేంద్రంలో ప్రత్యేక పూజలు, ఉట్టి కొట్టే సంబరాలు, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వేడుకలకు జిల్లా ప్రజలు, యాదవ బంధువులు, భక్తులు కుటుంబ సమేతంగా హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.