అమెరికా దారెటు?

20-09-2026 | 05:10am

ఇరాన్‌(Iran)ను దురాక్రమణ ద్వారా హస్తగతం చేసుకోవాలనుకునే వాడు చరిత్రలో పుట్టలేదు, పట్టబోడని టెహ్రాన్(Tehran) వీధుల్లో ఓ తల్లి తన పిల్లవాణ్ని పట్టుకొని నినదించింది. అమెరికా, ఇజ్రాయెల్‌(America, Israel)కు వ్యతిరేకంగా ఇరాన్‌లో గత శుక్రవారం లక్షలాది మంది వీధుల్లో ర్యాలీలు చేశారు. అమెరికాతో యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ ప్రభుత్వం(Government of Iran) పిలుపు మేరకు ఇంతపెద్ద సంఖ్యలో ఇరాన్ ప్రజలు ర్యాలీలు చేయడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఫిబ్రవరి 26న అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై ఒక్కసారిగా వైమానిక దాడులకు పాల్పడటంతో యుద్ధం మొదలైంది.

అది కాస్తా, హార్ముజ్ జలసంధి(Strait of Hormuz) కేంద్రంగా మారింది. ఇరాన్ అణు, సైనిక మౌళిక సదుపాయాలను(Nuclear and military infrastructure) మొదట లక్ష్యంగా చేసుకొని అమెరికా వైమానిక దాడులు జరిపినా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే చమురు రవాణాను(Oil transportation) దిగ్బంధం చేస్తూ, ఇరాన్ యుద్ధాన్ని హార్ముజ్ వైపు మళ్లించగలిగింది. ఇరాన్‌పై ముమ్మరంగా దాడులు చేసినా అమెరికాను ప్రతిఘటిస్తూ ఇరాన్ నిల బడగలిగింది. సుప్రీం లీడర్ అల్ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్‌లు హత్య చేసినా ఇరాన్ తన దృఢ సంకల్పాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకుంది.

శాంతి యత్నాల్లో అమెరికా తన ప్రయోజనాలను కాపాడుకునేలా ఒప్పందాలను రూపొందించుకుంటూ వాటిని తిరస్కరించింది. ఇప్పుడు ఇరాన్ విషయంలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిని అమెరికా ఎదుర్కొంటున్నది. ఇరాన్‌లోని ప్రస్తుత పాలకులను పూర్తిగా మట్టుబెట్టి, యుద్ధాన్ని ఒక కొలిక్కి తీసుకురావడానికి నవంబర్‌కల్లా ఒక పెద్ద నిర్ణయం తీసుకోనున్న ట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొస్తున్నారు. నిజానికి ఈ యుద్ధం వల్ల అమెరికా ఇప్పటికే బిలియన్ల డాలర్లు కోల్పోవాల్సివచ్చింది. ఆయుధ నిల్వలు సన్నగిల్లాయి.

ఇరాన్‌తో యుద్ధం దేశాధ్యక్షుని సొంత వ్యవహారం గా అమెరికాలోని పాలకులు, ప్రజలు చూస్తున్నారు. 60 శాతం మంది అమెరికన్లు, ఇరాన్ యుద్ధంపై ట్రంప్ ధోరణిని ఆమోదించలేదని సర్వేలు చెబుతున్నాయి. ఇరాన్ అణుకార్యక్రమాలకు చరమగీతం పాడుతామని చెప్పి, అక్కడి పాలకులను మార్చే దిశగా విధానాలను మార్చుకోవడమేమిటని అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు.

గ్యాస్ ధరలు పెరిగి నెలవారీ ఆర్థిక భా రం పెరుగుతుండటం వల్ల అమెరికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ యుద్ధంపై రిపబ్లికన్లలోనే చీలిక వచ్చింది. ఇది అనవసర యుద్ధమని డెమక్రాట్లు ట్రంప్‌ను తూర్పారపడుతున్నారు. అమెరికా విధానాలను ఈ స్థా యిలో దిగజార్చిన అధ్యక్షుడు దేశ చరిత్రలోనే లేడని మండిపడుతున్నారు. 

మరిన్ని వార్తలు