మహిళలు, బాలికలు నూతన చట్టాలపై అవగాహన
జిసిడివో మెస్రం ఛాయ
ఉట్నూర్,(విజయక్రాంతి): మహిళలు, బాలికలు నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిసిడివో మెస్రం ఛాయ(GCDO Mesram Chaya) అన్నారు. సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్(Post-Matric Hostel)లో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు అనే అంశంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పని ప్రదేశంలో మహిళలపై, బాలికలపై లైంగిక వేధింపుల చట్టం 2013(Sexual Harassment Act, 2013) ప్రకారం పది మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్ధ కార్యాలయంలో లైంగిక వేధింపుల నివారణ, నిషేధం పరిష్కారానికి ఒక యంత్రాంగాన్ని కలిగి ఉండాలని ఆమె అన్నారు. పిల్లల సంరక్షణ చట్టం, బాలికలపై లైంగిక నేరాల నిరోధక చట్టం వంటి నిబంధనలు బాలికల రక్షణకు బలమైన ఆయుధాలుగా నిలుస్తాయని అన్నారు. పాష్ చట్టం 2013 మహిళలకు తిరుగులేని ఆయుధం అని ఈ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆమె అన్నారు.కార్యక్రమంలో మర్సుకోల సరస్వతీ, శ్యామల HWO ప్రమీల ANM ఉన్నారు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.