ఘనంగా చేర్యాల ఏఎంసి పాలకవర్గ బాధ్యతల స్వీకరణ

05-10-2026 | 10:44pm

జనగామ, అక్టోబర్ 05 (విజయక్రాంతి): జనగామ నియోజకవర్గం చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి(Komuri Prashanth Reddy) సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ హాజరై ప్రశాంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మెరుగు బాలరాజు గౌడ్, దిశ సభ్యుడు బక్క శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు చెంచారపు బుచ్చిరెడ్డి, శివరాత్రి కుమార్, బనుక సిద్దిరాజ్ యాదవ్, బనుక ప్రభాకర్, మచ్చ కుమార్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు