గిరిజన యువతకు పోలీసు ఉద్యోగాలకోసం ఉచిత శిక్షణ
05-10-2026 | 11:09pm
భూపాలపల్లి (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గిరిజన యువతీ, యువకులకు పోలీసు కానిస్టేబుల్, సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో(ITDA PO Lenin Vatsal Toppo) తెలిపారు. శిక్షణకు ఎంపికైన వారికి ఉచిత భోజనం, వసతి కల్పిస్తామన్నారు.
అర్హత ఉన్న అభ్యర్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, స్టడీ సర్టిఫికెట్లు, పోలీసు ఉద్యోగానికి దరఖాస్తు చేసిన పత్రం ప్రతితో అక్టోబర్ 9 సాయంత్రం 5 గంటల్లోగా ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గిరిజన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.