వేధిస్తే మహిళలు షీటీంను ఆశ్రయించాలి

17-09-2026 | 11:19pm

- ఇన్స్పెక్టర్ దుర్గ

సిద్దిపేట క్రైం, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): మహిళలు వేధింపులకు గురైనప్పుడు మౌనంగా ఉండకుండా షీటీంను సంప్రదించాలని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ(Inspector Durga) కోరారు. గురువారం సిద్దిపేటలోని నారాయణ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ దుర్గ మాట్లాడుతూ, షీటీం పనితీరు, ఆపదలో ఉన్నవారికి ఎలా అండగా ఉంటుంది అనేది వివరించారు.

ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, సైబర్ బుల్లీయింగ్, మానవ అక్రమ రవాణాపై అప్రమత్తత, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, చైల్డ్ అబ్యూజ్, 'గుడ్ టచ్ - బాడ్ టచ్' గురించి వివరించారు. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు టీ-సేఫ్ యాప్ ప్రాముఖ్యాన్ని తెలియజేశారు. ఎక్కడైనా, ఎప్పుడైనా వేధింపులు ఎదురైతే వెంటనే డయల్ '112' లేదా సిద్దిపేట షీటీం నంబర్ 8712667434 కు సమాచారం అందించాలని సూచించారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పవర్ పాయింట్  ప్రజెంటేషన్ ద్వారా ఇన్స్పెక్టర్ దుర్గ వివరించారు.

మరిన్ని వార్తలు