19 August, 2026 | 1:33 AM

‘జాతీయ’ రికార్డును సాధించిన 32 మంది స్కేటింగ్ చిన్నారులు

19-08-2026 12:00 AM

వనపర్తి మండలం, ఆగస్టు 18 : హైదరాబాద్ బౌరంపేట్లో నిర్వహించిన 80 నిమిషాల నాన్స్టాప్ స్కేటింగ్ ఈవెంట్లో వనపర్తి జిల్లాకు చెందిన 32 మంది విద్యార్థులు జాతీయ స్థాయి రికార్డు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, కోచ్ రాథోడ్ కిషన్ జిల్లా ఎస్పీ సునిత రెడ్డిని కలిశారు. పోలీసు కార్యాలయంలో చిన్నారులు స్కేటింగ్ విన్యాసాలు ప్రదర్శించగా ఎస్పీ అభినందించారు. క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, పట్టుదలతో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.