ఇందిరమ్మ టవర్స్.. పార్టీలకు అతీతం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్: రాయదుర్గం మల్కంచెరువు వెనుక 2.85 ఎకరాల్లో ఇందిరమ్మ టవర్స్(Indiramma Towers) నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తొలి విడతలో 480 ఫ్లాట్లతో టవర్ నిర్మిస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఇళ్లు నిర్మిస్తామని, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా ఇళ్లు అందిస్తామని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాయదుర్గంలో తొలి విడతలో 480 ఫ్లాట్లతో ఇందిరమ్మ టవర్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. పేదలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. క్యూఆర్ పరిధిలో ప్రతి నియోజకవర్గంలో లక్ష ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి తెలిపారు. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు వచ్చే వరకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విడతల వారీగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పేదల విషయంలో రాజకీయ పార్టీలను చూడబోమని, అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందిస్తామని పొంగులేటి తెలిపారు. పేదలకు ఇళ్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయ వివక్షకు తావులేదని స్పష్టం చేశారు.