‘ఏజెంటిక్ ఏఐ క్యాంపస్’గా కేఎల్
యూనివర్సిటీని తీర్చిదిద్దే దిశగా అడుగులు
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): హెచ్‌సీఎల్ గ్రూప్(HCL Group)నకు చెందిన హెచ్‌సీఎల్ ఏఐ ల్యాబ్(HCL AI Lab) భాగస్వామ్యంతో దేశంలోనే తొలి ఏజెంటిక్ ఏఐ క్యాంపస్‌ను ప్రా రంభించినట్లు కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ(KL Deemed to be University) తెలిపింది. ఈ కార్యక్రమం కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్(KL University Vijayawada Campus), గ్రీన్‌ఫీల్డ్స్(Greenfields), వడ్డేశ్వరం, గుంటూరు(Guntur), ఏపీలో జరిగింది.
యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. జి. పార్థసారథి వర్మ, ప్రొ-వైస్ ఛాన్సలర్ డా. ఎన్. వెంకట్రామ్, డా. కె. రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డా. కె. పవన్ కుమార్, స్కూల్ డెవలప్మెంట్ డీన్ డా. ఎ. శ్రీనాథ్, అడిషనల్ డైరెక్ట ర్ డా. జె. శ్రీనివాసరావు, స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్ కేతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌సీఎల్ ఏఐ ల్యాబ్స్ తరఫున ఏఐ ల్యా బ్స్ జాతీయ అధిపతి దీపక్ శరణన్, ప్రాంతీ య అధిపతి సందీప్, ఆపరేషన్స్ హెడ్ సు మిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ భాగస్వా మ్యం ద్వారా విద్యార్థులకు ఏఐ, ఏజెంటిక్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ వంటి ఆధునిక సాంకేతిక అంశాల్లో పరిశ్రమకు అనుగుణమైన శిక్షణ, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం అందించనున్నట్లు యూనివర్సిటీ వెల్లడించింది.