పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త బ్రాంచ్
నాగర్‌కర్నూల్‌లో ప్రారంభం
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ సర్కిల్ కార్యాలయ పరిధిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నాగర్‌కర్నూల్ శాఖ(Punjab National Bank, Nagarkurnool Branch)ను సోమవారం నాగర్‌కర్నూల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్(Hemant Keshav Patil), హైదరాబాద్ జోనల్ హెడ్ (జనరల్ మేనేజర్) వందనా పాండే(Vandana Pandey) సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సర్కిల్ హె డ్ అరవింద్ కల్రా, నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ ఛైర్మన్ సునేంద్ర(Sunendra) పాల్గొన్నారు.
ఈ కొత్త శాఖ ప్రారంభంతో హైదరాబాద్ సర్కిల్ ఆఫీ స్ పరిధిలోని మొత్తం బ్రాంచీల సంఖ్య 79కి చేరింది. హైదరాబాద్ జోనల్ హెడ్ వందనా పాండే మాట్లాడుతూ.. తమ ఖాతాదారులకు సరళమైన, అందుబాటులో ఉండే, సురక్షితమైన, నాణ్యమైన బ్యాంకింగ్ సేవలను అం దించడానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమం బ్రాంచ్ హెడ్ హరీష్ బాబు కృతజ్ఞతా పూర్వక వంద న సమర్పణతో ముగిసింది.