నూతన అదనపు కలెక్టర్ల కు సన్మానం

24-10-2026 | 04:41pm

నిర్మల్ అక్టోబర్ 24 ( విజయ క్రాంతి) : జిల్లాలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్లు(Additional Collectors) (రెవెన్యూ, లోకల్ బాడీ)ను ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ(Aam Aadmi Party Telangana) రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్(Syed Haider) మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అదనపు కలెక్టర్లు సానుకూలంగా స్పందించారు.

ఈ కార్యక్రమంలో ఆప్ జిల్లా జనరల్ సెక్రటరీ సీ.హెచ్. వినోద్, ట్రెజరర్ అబ్దుల్ సాధిక్, టౌన్ ప్రెసిడెంట్ రవి, అధికార ప్రతినిధి వసంత్ రావు, నియోజకవర్గ ఇన్‌చార్జి మెరుగు రాజన్న, చొక్కాల భూమన్న, లాయర్ అరవింద్, షేక్ ఇమామ్, షేక్ షాదుల్లా తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు