6 September, 2026 | 7:31 PM

మంత్రి జూపల్లికి కలెక్టర్ ఘన స్వాగతం

06-09-2026 | 05:56pm

కుబీర్ (విజయ క్రాంతి): వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం బాసరకు వచ్చిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao)కు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా(Collector Bhavesh Mishra) ఘన స్వాగతం పలికారు. బాసర రాజన్న అతిథి గృహంలో మంత్రికి పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు అధికారులు మంత్రికి గౌరవ వందనం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, భైంసా సబ్‌ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు