బాసర ఆలయంలో కమిషనర్ పూజలు
23-10-2026 | 04:39pm
భైంసా అక్టోబర్ 23 ( విజయ క్రాంతి): రాష్ట్ర దేవదాయ శాఖ(State Endowments Department) కమిషనర్ హనుమంతరావు శుక్రవారం నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాల మందిరంలో ఉన్న అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ బైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, ఆలయ ఈవో అంజలీదేవి తాసిల్దార్ పవన్ చంద్ర ఆర్ అండ్ బి అధికారి సుభాష్ తదితరులు ఉన్నారు