యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

23-10-2026 | 04:41pm

ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాసరావు 

తాడ్వాయి,అక్టోబర్, 23( విజయక్రాంతి ): యువత మాదక ద్రవ్యాలకు(Drugs) దూరంగా ఉండాలని ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు(Yellareddy DSP Srinivas Rao) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామంలో శుక్రవారం పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ... యువకులు మత్తు పదార్థాలకు(narcotic substances) బానిస కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు. సైబర్ నేరాల(Cybercrimes) పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సైబర్ నేరగాళ్లు మోసపూరిత ఫోన్ కాల్స్, మెసేజ్(Phone calls, messages) లు పెడతారని ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఎవరికి తెలియజేయవద్దని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు కచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు.

బాలలను పనిలో పెట్టకుండా వారికి విద్యాభ్యాసం చేయించాలని కోరారు.బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని బాలల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సదాశివ నగర్ సిఐ వీరయ్య,తాడ్వాయి ఎస్సై నరేష్ స్థానిక సర్పంచ్ భాస్కర్ రెడ్డి.. తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు