రెండు బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
23-09-2026 | 06:56pm
ఖానాపూర్ (విజయక్రాంతి): మామడ మండలం(Mamda Mandal) బుర్దపల్లి గ్రామ సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. కొరికంటి గ్రామానికి చెందిన రాము, గూడెం సదేమియా బైక్‌పై నిర్మల్ వైపు వెళ్తుండగా.. తాండ్ర గ్రామానికి చెందిన భూమన్న బైక్‌పై బుర్దపల్లి గ్రామం వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో బుర్దపల్లి సమీపంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ శేఖర్, పైలట్ విజయ్ క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, అనంతరం అంబులెన్స్ లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మీరు చికిత్స పొందుతున్నట్టు వైద్యులు తెలిపారు.