పత్తి పంట కొనుగోలపై ఆంక్షలు తొలగించాలి

24-10-2026 | 04:26pm

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పత్తి పంట పై ప్రభుత్వం ఆంక్షలు తొలగించి ఎకరానికి 18000 చెల్లించాలని సిపిఐ నిర్మల్ జిల్లా కార్యదర్శి భూక్య రమేష్ డిమాండ్ చేశారు. రైతు సంఘం నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

రైతులు పండించిన పత్తి క్వింటాలకు రూ.18 వేలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఆరుగాలం కష్టపడి రైతులు పత్తి పంట పండిస్తే సరైన వానలు లేక పత్తి పూర్తిస్థాయిలో పంట పండలేదు ఏలీనో ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ప్రభుత్వాలు ఎలాంటి ఆంక్షలు విధించకుండా పత్తి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు సీసీఐ  పత్తి కొనుగోలు సమయంలో తేమ పేరుతో దండీ కొట్టకుండా సరైన ధర పెట్టి రైతులను ఆదుకోవాలని  కోరారు కార్యక్రమంలో పత్తి రైతులు జాదవ్ శంకర్, సంతోష్, ఉండలిక్, అనంతరావు రైతులు రైతు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు