హ్యాండ్‌బాల్ జట్టుకు క్రీడాకారుల ఎంపిక
ఆసిఫాబాద్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ జట్టు(Handball team) ఎంపిక పోటీలు శనివారం ఆసిఫాబాద్‌లోని గిరిజన ఆదర్శ బాలికల క్రీడా పాఠశాల(Tribal Ideal Girls Sports School) మైదానంలో నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల నుంచి సుమారు 80 మంది క్రీడాకారిణులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన 18 మంది క్రీడాకారిణులను(Sportswomen) ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ తెలిపారు.
ఎంపికైన క్రీడాకారిణులకు అక్టోబర్ 25 నుంచి 30వ తేదీ వరకు క్రీడా పాఠశాలలో(Sports School) శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. అనంతరం ఈ నెల 31 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఖమ్మంలో జరగనున్న 48వ జూనియర్ బాలికల తెలంగాణ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు తరఫున పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు.ఎంపిక పోటీల నిర్వహణకు మైదానంతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పించిన క్రీడా పాఠశాల యాజమాన్యానికి, గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామీణ, గిరిజన ప్రాంతాల బాలికల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ అంబాజీ, ఏసీఎంవో ఉద్ధవ్, ఏటీడీవో చిరంజీవి, జీసీడీవో శకుంతల, ప్రధానోపాధ్యాయుడు లింభారావు, హెచ్‌డబ్ల్యూవోలు విజయలక్ష్మి, సరిత, మధుకర్, పీడీ మీనా రెడ్డి, కొమురం భీమ్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, కోచ్‌లు అరవింద్, తిరుమల్, విద్యాసాగర్, రవి, రాకేష్, రాజలింగు, సాయి, యాదగిరి, గౌరీతో పాటు పలువురు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.