జ్యోతిర్లింగాలకు ఆర్టీసీ బస్సు

02-10-2026 | 06:40pm

నిర్మల్ అక్టోబర్ 2 (విజయక్రాంతి): నిర్మల్ డిపో యాత్ర బస్సు జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్లినట్టు నిర్మల్ డిఎం పండరీ(DM Pandari) తెలిపారు గుజరాత్ సోమనాథ్, ద్వారకకు ప్రత్యేక బస్సు నిర్మల్ జెండా ఊపారు. మహారాష్ట్రలో గల అహుండా నాగనాథ్, భద్ర మారుతి, గృష్ణేశ్వర్, ఎల్లోర, శని సిగ్నపూర్, షిర్డీ, నాసిక్, త్రియాంబకేశ్వర్, గుజరాత్ లో గల నిష్కలంక మహాదేవ్, సోమనాథ్, ద్వారకా, నాగ నాగేశ్వర్, మధ్యప్రదేశ్ లో గల ఉజ్జాయిని, ఓంకారేశ్వర్ దర్శించుకొని నిర్మల్ తిరిగి వస్తుందని ఆయన తెలిపారు.

ఈ యాత్రలో ఆరు జ్యోతిర్లింగాలు,14 పుణ్యక్షేత్రాలు దర్శించే భాగ్యం కలుగుతుందని ఈ యాత్ర వారం రోజులు కొనసాగుతుందని డిపోమేనేజర్ తెలిపారు. ఈ రోజు వెళ్తున్న బస్సు ఫుల్ అవ్వడం వలన ఇదే యాత్ర సోమనాథ్, ద్వారకా ఈ నెల 27 తేదీన భక్తుల కోరిక మేరకు మరో బస్సు పెట్టడం జరిగిందని అయన తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకొని ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు.ఛార్జి 8640/- రూ!! లు 7  ఏడు రోజులు యాత్ర ఉంటుందన్నారు.

ఈనెల 13 మరో సర్వీస్

ఈ నెల 13వ తేదీన అహుండ నగనథ్ ,భద్ర మారుతి, గృషేశ్వర్ ఎల్లోర, మిని తాజమహల్ ప్రత్యేక బస్సు ఉంటుందని, రెండు రోజుల ప్రయాణానికి 2000 రూ!! లు ఛార్జి మాత్రమె ఉంటుందని ఆయబ తెలిపారు.

ఈ బస్సుకు ముందస్తు బుకింగ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్రయనికులు కొరుకుంటె దసరా సెలవుల్లో మరిన్ని యాత్ర బస్సులు నడుపుతామని డిపోమేనేజర్ తెలిపారు.ఎల్లప్పుడూ ఇలాగే ఆర్టీసీ ని ఆదరించాలని మరిన్ని వివరాలకు 9959226003,  9440018549 లో సంప్రదించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు