నేడు పలిమెలకు మంత్రి శ్రీధర్ బాబు రాక
02-10-2026 | 07:27pm
పలిమెల. అక్టోబర్ 2 (విజయ క్రాంతి): నేడు పలిమెల మండలంలో ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు(IT Minister Duddilla Sridhar Babu) పర్యటించనున్నట్లు పలిమెల సర్పంచ్ జవ్వాజి పుష్పలత తిరుపతి తెలిపారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.
మంత్రి శ్రీధర్ బాబు పలిమేల గ్రామ పంచాయతీ కి 5.50కోట్ల నిధులు మంజూరు చేశారాని మండలంలోని పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేయనున్నట్లు పలిమెల సర్పంచ్ జవ్వాజి పుష్పలత తిరుపతి పేర్కొన్నారు. మండలానికి మంత్రి శ్రీధర్ బాబు రాక నేపథ్యంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గోని కోరారు.