అభివృద్ధికి నిధులు ఇవ్వాలి.. మంత్రి వివేక్‌కు కౌన్సిలర్ వినతి!

19-10-2026 | 01:07pm

చెన్నూర్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీ(Chennur Municipality)లోని 10వ వార్డు అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి ఆ వార్డు కౌన్సిలర్ గర్రెపల్లి శాంతారాణి వెంకటనర్సయ్య (బీజేపీ) వినతిపత్రం సమర్పించారు. సోమవారం చెన్నూర్‌లో మంత్రిని కలిసిన ఆమె, తన వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించి, నిధులు మంజూరు చేయించి సహకరించాలని కోరారు. వార్డు పరిధిలోని పలు రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రం అందించినట్లు కౌన్సిలర్ గర్రెపల్లి శాంతారాణి తెలిపారు.

మరిన్ని వార్తలు