పారిశుధ్య కార్మికులకు దసరా కానుకగా దుస్తుల పంపిణీ

19-10-2026 | 01:02pm

భిక్కనూర్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం ఇసన్నపల్లి గ్రామంలో సర్పంచ్ మేకల రాములు ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు దసరా కానుకగా దుస్తులు పంపిణీ చేశారు. గ్రామంలో సేవలందిస్తున్న కారోబార్, వాటర్‌మ్యాన్, పారిశుధ్య కార్మికులకు దుస్తులు (Clothes Distribution) అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ పరిశుభ్రతలో కార్మికుల సేవలు కీలకమని తెలిపారు. వారి కృషిని గుర్తించి పండుగ కానుకగా దుస్తులు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బొమ్మగారి రాజమణి శ్రీనివాస్‌తో పాటు గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు