భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయం
మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల రోడ్డులో పూసాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వైస్ ప్రెసిడెంట్, బిఆర్ఎస్(BRS) యువ నాయకులు చొప్పరి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి(Former MLA Dasari Manohar Reddy) హాజరయ్యారు.
ఈ సందర్భంగా గణేష్ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. గణేష్ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, సామాజిక స్పూర్తిని పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు
.అన్నదానం చేయడం ఎంతో గొప్ప సేవా కార్యక్రమమని ఆయన అన్నారు. ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం ద్వారా మానవత్వాన్ని చాటుకోవచ్చని, ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైన మేరకు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. భక్తులు గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అందరూ సహకరించాలని సూచించారు,అనంతరం కార్యక్రమ నిర్వాహకులు చొప్పరి అరుణ్ కుమార్, అంజలి దంపతులు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ, అన్నదాన కార్యక్రమం గురించి నిర్వాహకులను మాజీ ఎమ్మెల్యే అభినందించారు.కార్యక్రమ నిర్వాహకుడు చొప్పరి అరుణ్ కుమార్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు, స్థానిక ప్రజల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించేందుకు కృషి చేస్తామని తెలిపారు.