కబడ్డీ జిల్లా స్థాయి ఎంపిక పోటీలకు విశేష స్పందన
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): కబడ్డీ అసోసియేషన్(Kabaddi Association) ఆధ్వర్యంలో నిర్వహించిన సబ్ జూనియర్ జూనియర్ బాల బాలికల జట్ల ఎంపిక పోటీలకు విశేష స్పందన లభించింది. శనివారం పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో(Alfors School) నిర్వహించిన ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా 300 మంది బాలబాలికలు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ధర్మయ్య, కరుణాకర్ రెడ్డిలు తెలిపారు.
ఎంపిక పోటీలకు ఆతిథ్యమిచ్చిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో అద్వితీయమైన ప్రతిభ కనబరిచి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఆల్ఫోర్స్ ప్రిన్సిపాల్ సత్యం, వ్యాయామఉపాధ్యాయులు, దాసరి రమేష్, ప్రణయ్, దాసరి ప్రసాద్, ఆలేటి సంపత్, గెల్లు మధుకర్ యాదవ్, మహమ్మద్ షఫీ, కిషోర్, రాజేందర్ ప్రసాద్, శివ, పిట్ట భాస్కర్ తదితరులున్నారు.