మంథనిలో మహాలక్ష్మి ఆలయం వద్ద పచ్చదనం సందేశం
ప్రజలకు మొక్కల పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్
మంథని,(విజయ క్రాంతి): పర్యావరణ పరిరక్షణతోనే భావితరాలకు స్వచ్ఛమైన, పచ్చని వాతావరణాన్ని అందించగలమని మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్(Manthani Municipal Chairman Vodnala Srinivas) అన్నారు. మంథనిలోని మహాలక్ష్మి దేవాలయం వద్ద గురువారం మొక్కల పంపిణీ(Plant distribution) కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, స్థానిక కౌన్సిలర్ మారుపాక నిహారిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, భక్తులకు మొక్కలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలంతా తమ వంతు కృషి చేయాలని, మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. భావితరాలకు ఆహ్లాదకరమైన, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.






