5 September, 2026 | 1:12 AM

అమ్మ ఆశయం కోసం.. ఎంబీబీఎస్ సీటు సాధించిన చందన

04-09-2026 | 11:47pm

- తల్లి కన్న కలను నిజం చేసిన కూతురు

కొండపాక,(విజయక్రాంతి): తల్లి తనను డాక్టర్‌గా చూడాలన్న కలను నిజం చేసేందుకు కొండపాక మండల(Kondapaka Mandal) కేంద్రానికి చెందిన కొమ్ము చందన పట్టుదలతో చదివింది. తల్లి కవిత కన్న కల నెరవేరకముందే ఆమె మృతి చెందడంతో.. ఆ ఆశయాన్నే లక్ష్యంగా చేసుకున్న చందన నీట్‌లో 411 మార్కులు సాధించి ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో(Asifabad Government Medical College) ఎంబీబీఎస్ సీటు(MBBS seat) సాధించింది. తల్లి లేకపోయినా ఆమె కలను సాకారం చేసిన చందనను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.

మరిన్ని వార్తలు