కోనరావుపేటలో ప్రజా పాలన దినోత్సవం.. జెండా ఆవిష్కరణ

17-09-2026 | 07:43pm

కోనరావుపేట సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ప్రజాపాలన దినోత్సవం(Peoples Governance Day) సందర్భంగా కోనరావుపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, తాసిల్దార్ వరలక్ష్మి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో స్మిగ్దా రెడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయలో సర్పంచులు ప్రభుత్వ పాఠశాలలు, పార్టీ కార్యాలయాల్లో జెండాలను ఆవిష్కరించారు. అదేవిధంగా మండలంలోని పలు కార్యాలయాల్లోనూ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, గ్రామస్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా పాలన ప్రాధాన్యతను వివరించారు.

మరిన్ని వార్తలు