తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం

17-09-2026 | 09:07pm

బీరెడ్డి సాంబశివ..

వెంకటాపురం (నూగూరు)/ సెప్టెంబర్ 17/ (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట(Telangana Armed Peasant Struggle) అమరవీరుల స్ఫూర్తితో జిల్లాలో భూ ఉద్యమాన్ని నిర్మిస్తామని ములుగు జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ పేర్కొన్నారు. గురువారం నాడు భోదాపురం గ్రామంలో సర్పంచ్ కొరస నరసింహారావు అధ్యక్షతన జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవలో సభలో ఆయన మాట్లాడారు. అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించినారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం, భూస్వామ్య విధానానికి, జామిందార్లకు, జాగిర్దారులకు, వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాడు 10 లక్షల ఎకరాల భూమిని పంచిందని, పదివేల గ్రామాలకు విస్తరించి నాలుగు వేల గ్రామ రాజ్యలను ఏర్పాటు చేసింది.ప్రపంచ చరిత్రలో గుర్తింపు పొందిన ఈ పోరాటాన్ని వక్రీకరించాలని బిజెపి ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తుంది. ఈ పోరాటానికి సంబంధం లేని సంస్థలు రాజకీయ పార్టీలు ఈ పోరాటాన్ని విశ్లేషిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చరిత్రను వక్రీకరిస్తున్నారు.

ఆంధ్ర మహాసభ పేరుతో ఏర్పడ సంస్థ భాష సంస్కృతిక రంగాలకు విస్తరించి నాటి నిజాం ప్రభుత్వం యొక్క నిరంకుషానికి వ్యతిరేకంగా సంఘం పెట్టి ఎర్రజెండా నాయకత్వన వీరోచితమైనటువంటి పోరాటాన్ని చేసింది.ఈ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాల్ని అర్పించారని పేదల రాజ్యం రావాలని భూస్వాముల పెట్టుబడిదారుల గుండెల్లో గుణపాలు దింపింది ఈ పోరాటం అని గుర్తు చేశారు.దీని స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలలో రైతులు కార్మికులు సంస్థలు అనేక ప్రజా ఉద్యమాల్ని నడిపాయని గుర్తు చేశారు.

ఈ పోరాటాన్ని తట్టుకోలేక నిజాం ప్రభువు ఇండియన్ యూనియన్ ప్రభుత్వంతో చేతులు కలిపి హైదరాబాద్ సంస్థనాన్ని ఇండియన్  యూనియన్ గవర్నమెంట్ లో విలీనం చేశారు.ఈ విలీనం అనంతరం కమ్యూనిస్టు పార్టీలపైన సాయుధ పోరాటం నడిపిన కార్యకర్తల పైన రెండు సంవత్సరాల పాటు నెహ్రు సైన్యాలు నిర్బంధాన్ని ప్రయోగించి వేలాది మందిని జైల్లో పెట్టింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను గ్రామాలలో ఎక్కడికక్కడ కాల్పులు జరిపి చంపించారని గుర్తు చేశారు.

ఇంత వీరోచితంగా స్థాయినటువంటి ఈ పోరాటాన్ని బిజెపి ఆర్ఎస్ఎస్ హిందూ ముస్లిం వ్యతిరేక పోరాటంగా మార్చి రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తుంది. నిజాం ప్రభువు ముస్లిం, గ్రామాలలో జమీందారులుగా జాగిర్ధాలుగా విసునూరు రామచంద్రారెడ్డి లాంటి నరహంతకులు  ప్రజలను హింసించారు.

ఈ పోరాటంలో జమీందారులకు జాగిర్దారులకు వ్యతిరేకంగా షేక్ బంధకి, మొగ్ధం మోయినవుద్దీన్, అశ్వవుల్లా ఖాన్, సోయబుల్లాఖాన్, భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం,అనభేరి ప్రభాకర్ రావు సింగిరెడ్డి భూపతి రెడ్డి బద్దం ఎల్లారెడ్డి చాకలి ఐలమ్మ దొడ్డి కొమురయ్య తాను నాయక్, ఆరుట్ల కమలాదేవి. లాంటి ఎందరో వీరులు కులానికి, మతానికి ప్రాంతానికి, వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా సాగిన ఒక వర్గ పోరాటం అని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో రానున్న కాలంలో ములుగు జిల్లాలో పేద ప్రజలందరికీ ఇండ్లు ఇళ్లస్థలాల కోసం, నిరుపేదలకు భూములు పంచాలని డిమాండ్ తో రానున్న కాలంలో ఉద్యమాలు కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. 

మరిన్ని వార్తలు