గంభీరావుపేట ఏఎంసీ చైర్మన్ గా హమీద్
నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
గంభీరావుపేట, అక్టోబర్ 27 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)(Gambhiraopet Agricultural Market Committee) నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ గా మహమ్మద్ హమీద్, వైస్ చైర్మన్‌గా ఏం.భాస్కర్‌ను నియమించింది.
డైరెక్టర్లుగా గ్యాద శ్రీజ, బిచ్చల సతీష్, భూక్యా మురళి, ఎర్ర వేణుగోపాల్, పెద్దవేణి రాజమల్లయ్య, పుల్లూరి సతీష్, రాగు వీరప్రసాద్, గాడిచెర్ల శ్రీనివాస్, అల్లెపు రాము, లక్కిరెడ్డి మధుసూదన్ రెడ్డి, నాగపూరి రమేష్ గౌడ్‌లను నియమించారు.ఈ సందర్భంగా చైర్మన్ హమీద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. రైతులకు మార్కెట్‌లో అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు.