రూ.91.75 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం
- మూడు మహిళా సంఘాల భవనాలు ఇస్తానని హామీ
- రాజకీయ జన్మను ఇచ్చింది చందుర్తి,రుణపడి వుంటా
- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి, అక్టోబర్ 27,(విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Vemulawada MLA Adi Srinivas) అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో రూ.91.75 లక్షల విలువైన వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజలు,
ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆదిశ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడం, గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపడం, చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించడం లక్ష్యంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున అదనంగా డైనింగ్ హాల్, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.58 లక్షలు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు,.చందుర్తి మండల కేంద్రంలో తాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు సమీపంలోని బావుల నుంచి పైప్లైన్ ద్వారా నీటిని వాటర్ ట్యాంకులకు తరలించే పనులకు జిల్లా పరిషత్ నిధుల నుంచి రూ.11.75 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
మండల కేంద్రంలో 10 లక్షలతో నిర్మించిన మహిళా సంఘాల భవనం, అలాగే రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు.మహిళా సంఘాలు స్వయంగా వ్యాపారాలు నిర్వహిస్తూ ఆర్థికంగా ఎదగాలని, ఇందుకు ప్రభుత్వం అవసరమైన ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. చందుర్తిలో మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతోపాటు, మండల సమాఖ్యకు బస్సు అందించినట్లు తెలిపారు.
వీటి ద్వారా వచ్చే ఆదాయం మహిళా సంఘాలకు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నాయని పేర్కొన్నారు.మండల కేంద్రంలో మహిళా సంఘాల కోసం మిగిలిన మూడు భవనాలకు స్థలాన్ని గుర్తించి తీర్మానం చేసిన వెంటనే భవనాలకు కావాల్సిన నిధులను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రాజకియ జన్మను ఇచ్చింది చందుర్తి అని గుర్తు చేస్తూ ఒకే రోజు వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ఇందుకు నిదర్శనమన్నారు...
ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలు ప్రారంభించామని, వాటిలో ఐదు గ్యారెంటీలను అమలు చేశామని తెలిపారు.అర్థంతరంగా ఆగిన ఇళ్ల నిర్మాణాలు 400-600 స్క్వేర్ ఫీట్ నిబంధనల ప్రకారం ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే 4 లక్షల రూపాయలు అందిస్తామని అన్నారు. సందర్బంగా చందుర్తి పాలక వర్గం, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చందుర్తి సర్పంచ్ పులి సత్యం, ఉప సర్పంచ్ బత్తుల క్రాంతి,వార్డు సభ్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గొట్టే ప్రభాకర్, ఎఎంసి చైర్మన్ చెలుకల తిరుపతి, పాక్స్ చైర్మన్ లు, తహసీల్దార్ భూపతి,ఎంపీడీఓ రాధ,ఏపీఎం కల్పన,ఐసిడిఎస్ సూపర్వైసర్ శంకరమ్మ,అలాగే పెద్ద ఎత్తున మండల కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు.