రెడ్డి గాండ్ల సంఘం నూతన కార్యవర్గం
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 27 ( విజయక్రాంతి ) : భూపాలపల్లి రెడ్డి గాండ్ల సంఘం(Reddy Gandla Association) నూతన కార్యవర్గం ఇటీవల ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రెడ్డి గాoడ్ల సంఘం అధ్యక్షులు అయిత కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం మంగళవారం భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు,
ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మెన్ అయిత ప్రకాష్ రెడ్డి లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెడ్డి గాండ్ల నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మెన్ లకు పుష్పగుచ్ఛములు అందజేసి శాలువాలతో సత్కరించగా నూతన కార్యవర్గానికి వారు శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు వెన్నపురెడ్డి మహేష్ రెడ్డి, ఎనగంటి శంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కామిడి సుధాకర్ రెడ్డి, కోశాధికారి చల్ల తిరుపతి రెడ్డి, గౌరవ అధ్యక్షులు గద్దె పోచిరెడ్డి, ముఖ్య సలహాదారులు బండం పద్మారెడ్డి, కుంభం శ్రీనివాస్ రెడ్డి, చల్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రచార కార్యదర్శి పోటు సత్యనారాణ రెడ్డి, ఎనగంటి మల్లారెడ్డి, చల్ల రవీందర్ రెడ్డి, బొమ్మన శ్రీనివాస్ రెడ్డి, అయిత వీరారెడ్డి, ఎనగంటి అశోక్ రెడ్డి, చీర్ల జగన్ రెడ్డి, ములకల్ల లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి రాజిరెడ్డి, నాగుల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు