సాయంకాలం సమయంలో చీకట్లు...

27-10-2026 | 04:44pm

గ్రామాల్లో దినంలో వెలుగులు.. 

ఉట్నూర్, అక్టోబర్ 27( విజయక్రాంతి):  ఉట్నూర్  ఏజెన్సీ(Utnoor Agency) ప్రాంతంలోని   మారుమూల గ్రామాల్లో  దినమంతా విద్యుత్ బల్బులు(Electric bulbs) వెలుగుతున్న  పట్టించుకునే నాధుడు లేరు. సాయంకాలం ఆరు తర్వాత  విద్యుత్ సరఫరాలో  అంతరాయం వచ్చిందని గంటల తరబడి  పల్లె ప్రజలు చీకట్లో ఉండవలసిన పరిస్థితి నెలకొంది.

గ్రామాల్లో ఏర్పాటు చేసిన  విద్యుత్ దీపాలను  ఉదయం గ్రామపంచాయతీ వాళ్ళు  నిలిపివేయవలసి ఉన్న  పంచాయతీల కార్యదర్శులు,  సర్పంచులు  ఏ మాత్రం పట్టించుకోవడంలేదని  ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దినమంతా విద్యుత్ బల్బులు వెలగడంతో  గ్రామ పంచాయతీలకు  బిల్లులు వస్తున్న పంచాయతీల సిబ్బంది పట్టించుకోవడం లేదు.

ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని  ఉట్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, నార్నూర్, సిరికొండ, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని  పలు గ్రామాల్లో విద్యుత్ వెలుగులు దినంలో వెలుగుతున్న  స్ట్రీట్ లైట్ స్విచ్ ఆఫ్ చేసేవాళ్లు  ఏమాత్రం దృష్టి సారించడం లేదని  ప్రజలంటున్నారు.ఎల్ నినో ప్రభావంతో విద్యుత్ సరఫరాను  అవసరమున్న సమయంలో  వినియోగించుకోవాలని, తర్వాత  సరఫరా నిలిపివేస్తే  విద్యుత్ ఆదా అయితుందని  విద్యుత్ శాఖ అధికారులు  ప్రజలకు వివరిస్తున్న ప్రజలు సైతం విద్యుత్ ఆదాపై  దృష్టి సారించడం లేదు.

గ్రామపంచాయతీ పరిధిలోని  మారుమూల గిరిజన గ్రామాల్లో నిరంతరం వెలుగుతున్న విద్యుత్ దీపాలను స్విచ్ ఆఫ్ చేసే విధంగా  పంచాయతీల వాళ్ళు ఏర్పాటు చేయాలని  ప్రజలు కోరుతున్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా  నియంత్రించుటకు గ్రామపంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు ప్రత్యేక కృషి చేయాలని  ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు