సారంపల్లి జీపీ సిబ్బందికి పండుగ కానుకలు
తంగళ్ళపల్లి,అక్టోబర్ 13 (విజయక్రాంతి ):రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామపంచాయతీ (Sarampalli Gram Panchayat)సిబ్బందికి బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుగ్గిళ్ల భరత్ గౌడ్ తన సొంత ఖర్చులతో ఏడుగురికి చీరలు, నూతన దుస్తులు పంపిణీ చేశారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా పండుగ కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా సిబ్బంది భరత్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గుగ్గిళ్ల లావణ్య-నర్సయ్య గౌడ్, ఉపసర్పంచ్ సిరిసిల్ల వంశీ, పంచాయతీ కార్యదర్శి నాగుల హరిత, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు గడ్డమీది శ్రీనివాస్, ఎండీ హనీఫ్‌తో పాటు పలువురు నాయకులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.