వాటాకు గండం?
గోదావరి అనుసంధానంలో కొత్త ట్విస్ట్
- ఇచ్చంపల్లి నుంచి పోలవరానికి మార్గం మార్పు!
- రూట్ మారితే మనకు దక్కేదెంత?
- నీటి వాటాలపై కొరవడిన స్పష్టత
- తెలంగాణ ప్రయోజనాలపై ఆందోళన
- నవంబర్ 3న ఎన్‌డబ్ల్యూడీఏ కీలక భేటీ
- రాష్ట్ర వైఖరిపై ఉత్కంఠ
ప్రభుత్వ వైఖరి కీలకం..
తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలంటే ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వెల్లడించాలి. ఇచ్చంపల్లి, సమ్మక్క సాగర్ మార్గాలపై తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేయాలి. మార్గం మార్పుతో కలిగే ప్రయోజనా లు, నష్టాలపై సాంకేతిక నివేదిక కోరా లి. ప్రతిపాదిత నీటి వాటా, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల ప్రయోజనాలకు భరోసా కల్పించాలని కేంద్రాన్ని కోరా లి.
* కేంద్రం కూడా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే నిర్ణయం మరో రాష్ట్రా నికి నష్టం కలిగించకుండా సమతుల్యత పాటించాలి. నదుల అనుసంధా నం వంటి భారీ ప్రాజెక్టుల్లో రాష్ట్రాల అభిప్రాయాలు, నీటి హక్కులకు తగి న ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ నేపథ్యం లో ఢిల్లీలో జరిగే ఎన్‌డబ్ల్యూడీఏ భేటీ లో గోదావరి లింకుపై ఎలాం టి చర్చ జరుగుతుంది? ప్రతిపాదిత మార్గంలో మార్పులపై ఏ నిర్ణయాలు తీసుకుంటారు? తెలంగాణ అభ్యంతరాలు, నీటి వాటాలపై ఎలాంటి స్పష్టత వస్తుంది? అనేది కీలకం.
అక్టోబర్ 18 (విజయక్రాంతి) : గోదావరి జలాల(Godavari waters) తరలింపు దారి మారుతోందా? ఇన్నాళ్లూ ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్(Sammakka Sagar) నుంచి నాగార్జునసాగర్ మీదుగా కావేరీ బేసిన్‌కు నీటిని తరలించే ప్రతిపాదనపై చర్చ జరగ్గా.. ఇప్పుడు పోలవరం నుంచి బొల్లపల్లి మార్గం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. రూట్ మారితే రాష్ట్ర ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాకు భరోసా ఉంటుందా?
ఇప్పటికే అనుమతులు, నిర్మాణ దశల్లో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? ఇవే ఇప్పుడు కీలక ప్రశ్నలుగా మారాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 3న ఢిల్లీలో జరగనున్న జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశం ఎజెండాలో ఉన్నందున రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణపై ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందా? ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నది? అని ఉత్కంఠ నెలకొంది.
అయితే ఎజెండాలో అంశం చేర్చడం, ప్రాజెక్టు మార్గాన్ని ఖరారు చేయడం, నీటి కేటాయింపులపై తుది నిర్ణయం తీసుకోవడం వేర్వేరు దశలు. తాజా ప్రతిపా దనలపై అధికారిక పత్రాలు, రాష్ట్రాల అభిప్రాయాలు, సాంకేతిక అధ్యయనాల ఆధారంగా మాత్రమే తుది అంచనాకు రావాల్సి ఉంటుంది.
మార్గం మారితే.. ప్రభావమెంత?
గోదావరి అనుసంధానంలో నీటిని ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ మార్గంలో తరలించాలి, మధ్యలో ఏ రిజర్వాయర్లను వినియోగించాలనేది అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే మార్గం మారితే నీటి నిల్వ, పంపిణీ, సాగునీటి ప్రయోజనాల స్వరూపం కూడా మారే అవకాశం ఉంటుంది. ఇచ్చంపల్లి లేదా సమ్మక్క సాగర్ నుంచి నాగార్జునసాగర్ మీదుగా నీటిని తరలించే ప్రతిపాదన ద్వారా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు అదనపు సాగునీటి ప్రయోజనాలు కల్పిం చే అవకాశం ఉందన్న వాదన ఉంది.
మరోవైపు పోలవరం నుంచి బొల్లపల్లి వైపు నీటిని మళ్లించే ప్రతిపాదనలో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయ న్నది ప్రధాన చర్చగా మారింది. బొల్లపల్లి రిజర్వాయర్‌లో 150 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే ప్రతిపాదన ఉందన్న వాదనలు కూడా చర్చలో ఉన్నాయి. ఈ నిల్వ సామర్థ్యం, తరలించే నీటి పరిమాణం, ప్రాజెక్టు మార్గం, వివిధ రాష్ట్రాలకు కలిగే ప్రయోజనాలపై అధికారిక వివరాలు వెల్లడైతేనే మార్పుల ప్రభావాన్ని అంచనా వేసే అవకాశం ఉంటుంది.
అయితే నీటి తరలించే మార్గం మార్పు వల్ల రాష్ట్రానికి లభించే అదనపు సాగునీటి ప్రయోజనాలు, నీటి నిల్వ అవకాశాలు, భవిష్యత్తులో ప్రాజెక్టులను వినియోగించుకునే పరిస్థితులు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల నీటి వాటా, మార్గం ద్వారా కలిగే ప్రయోజనాలను విడివిడిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. గోదావరి లింకు చర్చలో 148 టీఎంసీల నీటి లెక్క అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని జలాలను మళ్లిం చే ప్రతిపాదనలో భాగంగా ఈ నీటి పరిమాణాన్ని ప్రస్తావిస్తున్నారు. తెలంగాణకు 43 టీఎంసీలు, ఏపీకి 44, తమిళనాడు 42.5, కర్ణాటకకు 16, పుదుచ్చేరికి 2.5 టీఎంసీలు అని చెబుతున్నారు. అయితే మిగులు జలాలుగా పేర్కొంటున్న నీరు ఎంత? ప్రతి ఏడా ది అంతే పరిమాణంలో నీరు అందుబాటులో ఉంటుందా? ఎగువ రాష్ట్రాల విని యోగం, పర్యావరణ అవసరాలు, వర్షపాతం మార్పులు, నదీ ప్రవాహాల ఆధా రం గా వాస్తవంగా ఎంత నీటిని మళ్లించవచ్చు? ఈ ప్రశ్నలకు సమగ్ర సమాధా నాలు లేకుండా ప్రాజెక్టు నీటి పంపిణీపై తుది నిర్ణయానికి రావడం కష్టంగా మా రింది.
సమగ్ర అధ్యయనం తప్పనిసరి..
తెలంగాణ సాగునీటి అవసరాలు, తాగునీటి సరఫరా, పరిశ్రమల డిమాండ్, భవిష్యత్తులో పెరిగే నీటి అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ మీదుగా నీటిని తరలించే ప్రతిపాదన ద్వారా ఉమ్మడి వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 2,38,236 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్న వాదన ఉంది.
అయితే ప్రతిపాదిత మార్గం మారితే ఈ ప్రాంతాలకు సాగునీరు అందించే అవకాశాలు తగ్గుతాయా? ప్రత్యామ్నాయ మార్గంలోనూ సమానమైన ప్రయోజనాలు కల్పించవచ్చా? తెలంగాణకు అదనంగా లభించే నీటిని ఎక్కడ నిల్వ చేస్తారు? ఏ ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టుకు చేరుస్తారు? ఈ అంశాలపై సమగ్ర సాంకేతిక అధ్యయనం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
గోదావరి అనుసంధా నంతోపాటు రాష్ట్రంలో ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, నిర్మాణ పురోగతి, నీటి కేటాయింపులు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ వంటి అంశాలు తెలంగాణ నీటి సమస్యలో కీలకంగా ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన 139 టీఎంసీల నీటి వినియోగంతో ముడిపడిన ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొత్త అనుసంధాన ప్రాజెక్టు ద్వారా కలిగే ప్రయోజనాలను అంచనా వేయడానికి ముందుగా తెలంగాణకు ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల అవసరాలు,
నీటి కేటాయింపులు, అనుమతుల స్థితిని సమగ్రంగా పరిశీలించాల్సిన అసవరం ఉంది. రాష్ట్రానికి నీటి హక్కులు ఉండటం ఒక అంశమైతే, వాటిని వాస్తవంగా వినియోగించుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నిధులు, అనుమతులు సమకూర్చుకోవడం మరో అంశం. ఈ రెండింటిలో లోపాలుంటే కేటాయింపులు ఉన్నప్పటికీ ఆశించిన ప్రయో జనాలు అందకపోయే ప్రమాదం ఉంది.
రాష్ట్రంలోని దేవాదుల, కల్వకుర్తి, కన్నెపల్లి వంటి ప్రాజెక్టుల ద్వారా అందుబాటులో ఉన్న నీటిని ఎంత మేరకు వినియోగించారు? ఎన్ని మోటార్లు పనిచేశాయి? ఎంత నీటిని ఎత్తిపోశారు? ఆయకట్టుకు ఎంత నీరు అందింది? అన్న అంశాలపై ప్రాజెక్టుల వారీగా వివరాలు వెల్లడిస్తే వాస్తవ పరిస్థితి అర్థమయ్యే అవకాశం ఉంది.
వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను ముందుగానే అంచనా వేసి రిజర్వాయర్ల నిర్వహణ, తాగునీటి సరఫరా, పంటల ప్రణాళిక, ఎత్తిపోతల పథకాల నిర్వహణపై ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవడంతోపాటు భవిష్యత్తు అవసరాలకు సరిపడా నిల్వలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి.